రాష్ట్రస్థాయి జావలిన్ త్రోలో రజక పథకం

12-10-2026 | 10:26pm

కొత్తగూడెం,(విజయక్రాంతి): 12వ తెలంగాణ రాష్ట్ర సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ మీట్–2026(Telangana State Sub-Junior Athletics Meet)లో అండర్‌–12 బాలుర కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో కొత్తగూడెంకు చెందిన బి. శైలేష్ రజత పతకం సాధించాడు. ఆసిఫాబాద్‌లోని టి.డబ్ల్యూ. మోడల్ స్కూల్ (గర్ల్స్) వేదికగా నిర్వహించిన ఈ పోటీల్లో 37.44 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శైలేష్‌ ను అభినందించారు. జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి, అంతర్జాతీయ అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. మహీధర్, పల్లె పల్లెకు ఆటా కార్యనిర్వాహకులు శైలేష్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శైలేష్ సాధించిన విజయంపై కోచ్ డి.మల్లికార్జున రావు, ఎస్కె రియాజ్ పాషా హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారుడి కృషి, క్రమశిక్షణ, నిరంతర సాధన ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు.

మరిన్ని వార్తలు