గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని సంతకాల సేకరణ
కామారెడ్డి,(విజయక్రాంతి): గోహత్యలు నిషేధించాలని గోవులను చంపరాదని,గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జై హనుమాన్ యోగ కేంద్రంలో సోమవారం గో సేవకులు మోహన్ లాల్ పటేల్ ఆధ్వర్యంలో యోగ గురువైన గరి పల్లి అంజయ్య, ఎల్లంకి సుదర్శన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా యోగా గురువు గరిపల్లి అంజయ్య మాట్లాడుతూ జై హనుమాన్ యోగా కేంద్రం నుండి అందరం సభ్యులను కలిసి సుమారు పదివేల సంతకాల సేకరణ చేస్తామని సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యోగ సభ్యులు యేల్లంకి సుదర్శన్, గోపాల్, పార్శి సతీష్, రాజేందర్, ముప్పారపు, రాజేందర్, మోటూరి విట్టల్, పార్శీ ఈశ్వర్, బంకటేష్ శ్రీను,నక్క సిద్ధిరాములు, కరెంట్ రాజేందర్ , ఆమెటి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.