చేగుంట విద్యుత్ సమస్యపై తక్షణ స్పందన

13-10-2026 | 12:02am

చేగుంట విద్యుత్ సమస్యపై చెరుకు శ్రీనివాస్ రెడ్డి తక్షణ స్పందన

జిల్లా ఎస్‌ఈకి ఫోన్ చేసి 11 గంటల విద్యుత్ సరఫరాకు ఆదేశం

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలంలో నెలకొన్న విద్యుత్ సమస్య(Chegunta Power Issue)ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి(Cheruku Srinivas Reddy) దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈకి ఫోన్ చేసి, చేగుంట మండల ప్రజలకు రోజుకు 11 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళ రావు, డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, కోండి శ్రీనివాస్, సాయి, స్వామి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు