ఎన్నికల ప్రధాన కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): దేశ ప్రజల ఓట్లు అక్రమంగా సర్ పేరుతో తొలగిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ముదిగొండ ప్రశాంత్(SFI leader Mudigonda Prashanth) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని పౌర హక్కుల హరిస్తూ దేశ ప్రజల ఓట్లు తొలగించే బిజెపి(BJP) ప్రభుత్వ ఏకపక్ష విధానాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న ఎస్ఎఫ్ఐ ఆందోళన కారులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రశ్నించే గొంతుకలను అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని కుట్ర పూరితమైన చర్యలు వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని లక్షలాది మంది ఓట్లను సర్ పేరుతో తొలగించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వేంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పాత విధానాన్నే పునరుద్ధరించాలన్నారు.
రాజ్యాంగ హక్కులను హరిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ఉద్యమాలు ఉధృతం చేయాలని అన్నారు. సర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు శనగవరపు సంజయ్,కత్తి దాసు,వంశీ, మనోజ్, శేఖర్ జీవన్, సాంబ,సదాశివ, సాంబ దీపక్, శరత్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.