అమ్మవారి పూజల్లో బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి

17-10-2026 | 06:00pm

దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి

రామచంద్రపురం అక్టోబర్ 17: భారతి నగర్ డివిజన్ పరిధిలోని సిరికి ఆఫీస్, ఎఫ్ పార్క్, నేతాజీ ఫంక్షన్ హాల్, ఓల్డ్ ఎం.ఐ.జీ. బి పార్క్‌లలో నిర్వహించిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో(Devi Navratri festival) వి.ఆదర్శ్ రెడ్డి(V. Adarsh ​​Reddy) బి.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్ ఎం.ఐ.జీ. బి పార్క్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి  మాట్లాడుతూ దేవి నవరాత్రులు అమ్మవారి శక్తి, వైభవానికి ప్రతీకలని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు