లక్ష పుష్పార్చన పూజ చేసిన ఎమ్మెల్యే
నిర్మల్ అక్టోబర్ 17 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) & రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం కోసం, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJLP leader and Nirmal MLA Alleti Maheshwar Reddy) సతీమణి ఏలేటి కవితారెడ్డి(Kavitha Reddy) గారు లక్ష పుష్పార్చన, శ్రీ లలితా సహస్రనామ పూజలను(Sri Lalita Sahasranama Pooja) భక్తిశ్రద్ధలతో(Devotional) నిర్వహించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాస భవనంలో శాస్త్రోత్తంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
అమ్మవారిని ప్రార్థిస్తూ నిర్మల్ జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సాగు చేసిన పంటలు సమృద్ధిగా పండి మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. మహిళలకు ఎమ్మెల్యే సతీమణి వాయినాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు మేధావులు విద్యావంతులు పాల్గొన్నారు.