ఎల్ నినో ముప్పు: భూగర్భ జలాలే రక్షణ కవచం!

17-10-2026 | 05:48pm

* ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు

* జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

పాపన్నపేట,అక్టోబర్17: వీబీ–జీ రామ్ జీ పథకం(VB-G Ram Ji Scheme) కింద పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్(District Collector Pratima Singh) పేర్కొన్నారు. శనివారం పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో వీ బీ జీ రామ్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. పంటల సాగుకు(Crop Cultivation) నీటి కొరత లేకుండా, వర్షపు నీటిని ఒడిసిపట్టి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకునేందుకు చేపడుతున్న ఫామ్ పాండ్ల నిర్మాణo(Construction of farm ponds), సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం, జలసిరి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఫామ్ పాండ్ల నిర్మాణ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత లోతు, ఎత్తు, పొడవులతో ఫామ్ పాండ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలోని ప్రతీ గ్రామ పంచాయతీలో ఐదు ఫామ్ పాండ్ల చొప్పున ఎంపిక చేసి, వాటి నిర్మాణ పనులను క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.

నిర్మాణ పనులకు ప్రతిరోజూ ఎంత మంది కూలీలు హాజరవుతున్నారు, వారికి ఎంత మేర కూలి చెల్లిస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరును తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

గ్రామాల్లో భూగర్భ జల మట్టాల పెంపు, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వీబీ–జీ రామ్ జీ పథకం కింద అవసరమైన పనులను గుర్తించి చేపట్టాలని సూచించారు. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతులు, ఇతర నీటి సంరక్షణ పనులకు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ శ్రీనివాసరావు, ఎంపీడీవో విష్ణువర్ధన్ తహాసిల్దార్ సతీష్, గ్రామ మాజీ సర్పంచ్ జగన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు