రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

03-10-2026 | 10:54pm

ఘట్ కేసర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదంలో(Road accident) ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ లోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో(Sanskriti Engineering College) డిప్లమా 3వ సంవత్సరం చదువుతున్న రాకెల సాయి సిద్ధార్థ్, అన్నెపోగు శివప్రసాద్ ఇద్దరూ కెటిఎమ్ ద్విచక్ర వాహనం  (TG08BB8815) పై కాలేజీకి వెళ్తున్నారు. సాయి సిద్ధార్థ్ వాహనం నడుపుతుండగా, శివ ప్రసాద్ పిల్లియన్‌గా ఉన్నాడు.

ఘట్ కేసర్ మాధవరెడ్డి బ్రిడ్జి వద్ద టాటా ఏస్ గోల్డ్ గూడ్స్ వాహనం నంబర్ (TS10UC4681) డ్రైవర్ ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే సమయంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్‌గా వాహనం నడుపుతూ వారి లేన్‌లోకి వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సాయి సిద్ధార్థ్‌కు తల కుడి భాగంలో కుడి భుజానికి గాయాలు కాగా, శివ ప్రసాద్ కుడి చేతికి ఫ్రాక్చర్ అయింది. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ లెంక రమేష్ పై ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు