రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
- జిల్లాలో 352 కొనుగోలు కేంద్రాల గుర్తింపు
- కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : వానాకాలం సీజన్(Monsoon season) లో ధాన్యం కొనుగోళ్లను(Grain procurement) పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Tejas Nandlal Pawar) ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement) సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 352 కేంద్రాలను గుర్తించగా, 267 కేంద్రాలను తొలి దశలో ప్రారంభిస్తామన్నారు. ప్రతి కేంద్రంలో తూకం యంత్రాలు, తేమ మీటర్లు, గన్నీ సంచులు, టార్పాలిన్లు, హమాలీలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని, రవాణా వాహనాలను జిపిఎస్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. ఓపిఎంఎస్ లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిపించాలన్నారు. ,సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందేలా చూడాలన్నారు. మధ్యవర్తులు, నకిలీ ట్రక్ చిట్స్, అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.