ప్లాస్టిక్‌కు స్వస్తి.. లక్ష్మీపురంలో క్లాత్ బ్యాగుల వినియోగం
23-09-2026 | 08:22pm
బూర్గంపాడు, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా, స్వచ్ఛ లక్ష్మీపురంగా తీర్చిదిద్దే లక్ష్యంతో క్లాత్ బ్యాగ్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) బుధవారం ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ బాదం వెంకటేశ్వరరెడ్డి(Sarpanch Badam Venkateswara Reddy) రూపొందించిన బ్యాగ్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. క్లాత్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ స్వచ్ఛత, పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. లక్ష్మీపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యంతో కృషి చేయాలని పేర్కొన్నారు.