పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ

02-11-2026 | 04:02pm

టేకులపల్లి,(విజయక్రాంతి): మండలంలోని బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Boddu ZP High School)ను బోడు గ్రామపంచాయతీ సర్పంచ్ పోదేం స్వరూప–సుధీర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యాభ్యాసం, పరీక్షల సన్నద్ధతపై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు, పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు సూచనలు చేశారు.

అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కుంజా సాంబయ్య, పోతుగంటి వీరభద్రం, క్యాగర్ల శ్రీనివాస్, బస్వాలింగం, మీనుగు సురేష్, చిలువేరు చంద్రశేఖర్ పాల్గొని పలు సూచనలు చేశారు. పంచాయతీ కార్యదర్శి మేడి లక్ష్మణ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు