ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలి

02-11-2026 | 05:04pm

నిజాంసాగర్ నవంబర్ 02( విజయ క్రాంతి): ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించాలని  అచ్చంపేట్  సహకార సంఘం(Achampet Cooperative Society) చైర్ పర్సన్ పట్లోళ్ల జనార్ధన్ రెడ్డి రైతులను సంఘ పరిధిలో గల కొనుగోలు కేంద్రలను సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు.సంఘానికి ఇచ్చే ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను చెల్లిస్తామన్నారు.

ధాన్యాన్ని తప్పనిసరిగా చెన్ని పట్టాలని రైతులకు వివరించారు.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చెన్నె పట్టని ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరగదు అని రైతులకు వివరించారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి విఠల్ గ,అచ్చంపేట్ గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య , సంఘ సెక్రెటరీ సంగమేశ్వర్ గౌడ్, రైతులు, డైరెక్టర్లు,సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు