పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా
- రానున్నది బీఆర్ఎస్ పార్టీ సర్కారే
- రేగా సమక్షంలో పలువురి చేరిక
గుండాల, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని(BRS Party Office) జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు(Former Pinapaka MLA Rega Kantha Rao) ఆదివారం ప్రారంభించారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కానీ, పినపాక నియోజకవర్గంలో కానీ ప్రజల కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ సర్కారు పోయి బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మరలా అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి(KCR is the Chief Minister) అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు.
రానున్నది బీఆర్ఎస్ సర్కారే అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రేగా సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జ్ దిండిగల రాజేందర్, ఆళ్లపల్లి మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల నాయకులు గడ్డం వీరన్న, పార్టీ మోకాళ్ళ వీరస్వామి, మహిళా నాయకులు, వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.