క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం

25-10-2026 | 07:15pm

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి/చిట్యాల, అక్టోబర్ 25 (విజయక్రాంతి): క్రీడాకారులను(Sportsmen) ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో నిర్వహించిన జీఎస్‌ఆర్‌ సీసీపీఎల్‌-3 క్రికెట్‌ టోర్నమెంట్‌(GSR CCPL-3 Cricket Tournament) ముగింపు కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(Bhupalpally MLA Gandra Satyanarayana Rao) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. విజేతలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో పాటు విద్యలోనూ ముందుండాలని కోరారు.టోర్నమెంట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు.ఈ

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, స్థానిక సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచులు, మండల నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు