కరీంనగరంలో ఖాకీల సైకిల్ ర్యాలీ
వారోత్సవాల్లో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే..
సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 25(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను(Police Martyrs' Commemoration Week) పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ పోలీస్ కమీషనరేట్(Karimnagar Police Commissionerate) ఆధ్వర్యంలో నగరంలో 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం(Gaush Alam) పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.
ఆదివారం ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్ స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, ఇందిరా చౌక్, మంకమ్మతోట, జ్యోతి నగర్, కెమిస్ట్ భవన్ మీదుగా కోర్ట్ , మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌక్, నాఖా చౌరస్తా, బోట్ సర్కిల్, కమాన్ , బస్టాండ్ సర్కిల్ మీదుగా ప్రయాణించి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసింది. కార్యక్రమ అనంతరం సీపీ ర్యాలీలో పాల్గొన్న సభ్యులకు అమరవీరుల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏసిపిలు వెంకటస్వామి, విజయకుమార్ కమిషనరేట్ చెందిన ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కరీంనగర్ కమిషనరేట్ రన్నర్స్ , సైక్లిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ పాసుల, డాక్టర్ కిరణ్, అడ్వకేట్ తిరుపతిరెడ్డి లతో పాటు పాఠశాల విద్యార్థులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.