వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం

25-10-2026 | 07:41pm

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

గుండాల, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పోలు రమేష్-రేణుక దంపతులు వేద పురోహితులచే ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారికి భక్తులు(devotees) మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలతో కుంకుమ పూజా కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ దాతలు పోలు సురేష్ దంపతులు, పోలు రాజేష్ దంపతులు, తదితరులు నిర్వహించిన మహా అన్న ప్రసాద కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలను స్వీకరించారు.  ఈ వేడుకలతో మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు