ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

11-09-2026 | 10:17am

గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 41 వ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం నాయకులతోపాటు ఆదివాసీ సంఘాల నాయకులు, యువజన విభాగం నాయకులు పాల్గొని ఐలమ్మ పోరాట ప్రతిమ గురించి కొనియాడారు. తెలంగాణ ప్రజల పీడిత ప్రజల విముక్తి కోసం, భూమి, భుక్తి కోసం ఆమె చేసిన పోరాటాలను గుర్తు చేశారు.

 ధరలు భూస్వాములకు పెత్తందారులకు ఎదురుతిరిగిన ఘన చరిత్ర ఆమెకు ఉన్నదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గడ్డం లాలయ్య, గడ్డం వీరన్న, గడ్డం రమేష్, గడ్డం మోహన్, గడ్డం నాగేశ్వరరావు,గడ్డం నారాయణ, గడ్డం రవి, గడ్డం రాజేష్,గామాలపాటి లక్ష్మీనారాయణ, గడ్డం సత్యం, గడ్డం శ్రీకాంత్, నడి గొట్టి నరేష్, సాట్టు వినోద్, గామాలపాటి నవీన్, గడ్డం సుమంత్, గడ్డం పాపయ్య, గామాలపాటి రాహుల్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు వీసి దొర, తుడుందెబ్బ మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు, నవ చైతన్య యూత్ అధ్యక్షులు ఆజాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు