స్వచ్ఛ ఆటోలపై సీఎం ప్రకటన చేయాలి: లేకపోతే ఉద్యమిస్తాం!

11-09-2026 | 10:40am

సీఎంకు కవిత డిమాండ్

40 వేల మంది కార్మికులతో ఉద్యమిస్తాం

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు(Telangana Monsoon Session) ఐదోరోజూ కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో క్యూర్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు(Municipal Law Amendment Bills) ప్రవేశ పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చెత్త సేకరణకు సంబంధించిన స్వచ్ఛ ఆటోలపై స్పష్టమైన ప్రకటన చేయాలని  తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ప్రాపర్టీ టాక్స్(Property Tax)తో పాటే చెత్త సేకరణ డబ్బులు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. చెత్త సేకరణను పెద్దకార్పొరేట్ సంస్థకు కట్టబెట్టబోమని ఇప్పుడున్న విధానంలోనే ప్రస్తుత స్చచ్ఛ ఆటోలతోనే చెత్త సేకరిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. చెత్త సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వకుంటే 40 వేల మంది స్వచ్ఛ ఆటో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కవిత హెచ్చరించారు.

మరిన్ని వార్తలు