బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు
11-09-2026 | 10:26am
హైదరాబాద్: సంచలనం రేపిన బొల్లారం మద్రాస్ రెజిమెంట్(Bollaram Madras Regiment) ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చోరీకి గురైన ఆయుధాలు, మ్యాగజైన్స్, బుల్లెట్స్, బైనాక్యులర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ అధికారితో పాటు మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో విశ్రాంత ఆర్మీ అధికారి ఇంట్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్ ఛార్జ్(Bell of Arms in-charge), బుల్లెట్స్ ఇచ్చే ఆమ్నిషన్ సెక్షన్ ఇన్ ఛార్జ్ సహకారంతో చోరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.