కొయ్యగుట్ట గురుకులంలో నీటి సమస్యకు పరిష్కారం

11-09-2026 | 10:14am

విజయక్రాంతి కథనానికి స్పందన

విజయ క్రాంతి కథనంతో కదిలిన అధికారులు

విద్యార్థినులకు ఊరట... విజయక్రాంతికి కృతజ్ఞతలు

బాన్సువాడ, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట గురుకుల పాఠశాలలో(Koyyagutta Gurukulam) నెలకొన్న నీటి సమస్యపై విజయ క్రాంతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను గుర్తించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో గురుకులంలో నీటి సమస్యకు పరిష్కారం లభించడంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు.

విద్యార్థినుల సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి మున్సిపల్ అధికారుల(Municipal officials) దృష్టికి తీసుకెళ్లిన విజయక్రాంతికి గురుకుల విద్యార్థినులు అభినందనలు తెలిపారు. తమ సమస్య పరిష్కారానికి కథనం కారణమైందని, సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే పత్రికల పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థినుల సమస్యకు పరిష్కారం చూపిన అధికారులకు, సమస్యను వెలుగులోకి తెచ్చిన విజయక్రాంతికి(vijayakranthi) విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు