స్వచ్ఛతకు శ్రమదానం

01-10-2026 | 04:47pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని కృష్ణసాగర్‌ గ్రామపంచాయతీలో గురువారం స్వచ్ఛతా కార్యక్రమాలు(Cleanliness programs) నిర్వహించారు.సర్పంచ్‌ తాటి వాణి, ఉపసర్పంచ్‌ బి.మోహన్‌రావు ఆధ్వర్యంలో ఐటీసీ వాష్‌, ఇతర ఐటీసీ సంస్థల ప్రతినిధులు, గ్రామస్థులు శ్రమదానంలో పాల్గొని గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారిశుధ్య నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల స్వచ్ఛతపై వి.బి.జి. రామ్‌జీ మ్యాప్‌ ద్వారా అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామంలో పారిశుధ్య సేవలందిస్తున్న ఎంపీడబ్ల్యూ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. గ్రామంలో నిరంతరం పారిశుధ్యాన్ని కొనసాగించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని నిర్వాహకులు సూచించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, వార్డు సభ్యులు,పంచాయతీ సిబ్బంది,మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు