బొల్లారం గ్రామంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం

01-10-2026 | 05:07pm

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గోడ గడియారాల అందజేత

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 1 (విజయ క్రాంతి):మండలంలోని బొల్లారం గ్రామంలో స్వచ్ఛతాహీ సేవా(Swachhata Hi Seva) కార్యక్రమంలో భాగంగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొని పారిశుధ్య పనుల్లో శ్రమదానం చేశారు.అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు గోడ గడియారాలను పంపిణీ చేయడం జరిగింది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులను అభినందిస్తూ ఈ గోడ గడియారాలను అందజేశారు.గ్రామంలో స్వచ్ఛత,పారిశుభ్రం మరియు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు,గ్రామ పెద్దలు, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు