స్వచ్ఛత హీ సేవలో డ్రైనేజీ పూడిక తొలగింపు

21-09-2026 | 05:43pm

అశ్వాపురం, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మొండికుంట గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ మర్రి సంధ్య ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛత హీ సేవ(Swachhata Hi Seva) కార్యక్రమంలో భాగంగా చుంచు వీరయ్య ఇంటి సమీపంలోని డ్రైనేజీ పూడికను తొలగించారు. అలాగే పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న 120 కేఎల్ ఓహెచ్‌ఎస్‌ఆర్‌(OHSR) నీటి ట్యాంకును శుభ్రం చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎం. సంధ్యారాణి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు