ఆడతనంలో అమ్మని చూడలేని మూర్ఖులు

21-09-2026 | 06:55pm

ప్రపంచంలో ఓ మనిషికి వెల్‌కమ్ చెప్పేందుకు ఓ అమ్మ పడే వేదన ఎవరికీ తెలియదు.. అలాంటి వేదన నుంచి ఓ ప్రాణానికి జన్మనివ్వడం అత్యంత మధురమైన కార్యం. అలాంటి సమయంలో అమ్మాయి నుంచి అమ్మగా మారే ఆమె వేదనను చూడలేని కొందరు.. ఆమె శరీరంలో కలిగే మార్పులను ఎగతాళిగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్..?

ఇలాంటి ట్రోల్స్‌కు కత్రినా కైఫ్(Katrina Kai) చిక్కింది. అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆమెను చూసిన కొందరు ఆమెపై ట్రోల్స్ చేశారు. అయితే ట్రోలర్స్ నోళ్లు మూయించేందుకు ఇండస్ట్రీ మొత్తం కత్రినా వెనుక స్ట్రాంగ్‌గా నిలబడింది. బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్న హృతిక్ రోషన్.. ఆ ట్రోలర్లను తిప్పికొడుతూ పెట్టిన పోస్ట్‌ను లైక్ చేసి గట్టి సపోర్ట్ ఇచ్చారు.


మరిన్ని వార్తలు