తహసీల్దార్ కార్యాలయం తరలింపు ఆలోచన విరమించుకోవాలి
21-09-2026 | 06:55pm
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని(Mathampally Mandal Revenue Office) ప్రస్తుత ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం(Prajavani program)లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ నిర్ణయం వల్ల మండల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సేవలు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండేలా,సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయం (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) పరిధిలోనే నూతన రెవెన్యూ కార్యాలయాన్ని నిర్మించాలని అధికారులను కోరారు.