ఉచిత యూనిఫామ్‌తో విద్యార్థుల్లో సమానత్వం
టేకులపల్లి, (విజయక్రాంతి) సెప్టెంబరు 25: ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫామ్, టై, బెల్ట్‌లను శుక్రవారం వాగొడ్డు తండా MPPS లో పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు భూక్యా వీరన్న అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. తెలంగాణ దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాణోతు లక్ష్మ మాట్లాడుతూ.. ఉచిత యూనిఫామ్‌తో విద్యార్థుల్లో సమానత్వం, ఐక్యత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ప్రధానోపాధ్యాయుడు భూక్యా వీరన్న మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వారికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ టీచర్లు మాలోత్ రాణి, మాలోత్ చైతన్య, లకావత్ భాను ప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.