అప్పారావుపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా

02-10-2026 | 05:08pm

దమ్మపేట, అక్టోబర్ 02 (విజయక్రాంతి): పామాయిల్(Palm Oil) దిగుమతి సుంకాల తగ్గింపు ఫలితంగా టన్నుకు 384 తగ్గటాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అప్పారావుపేట ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మేనేజర్ నాగబాబుకు అందజేశారు.

ఈ సందర్భంగా దొడ్డాలక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల ఫలితంగా అనేక రకాల పంటలకు గిట్టుబాటు ధర లేని పక్షంలో దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో గత 40 సంవత్సరాల నుండి సామాన్య రైతు నుండి పెద్ద రైతుల వరకు  పామాయిల్ పంట ను నమ్ముకుని సాగు చేస్తున్నారని అన్నారు.

మోడీ అవలంబిస్తున్న తిరోగమన వ్యవసాయ విధానాల వలన నేడు పామాయిల్ సాగు ప్రమాదంలో పడిందని, ట్రంపు చెప్పినట్లు మోడీ మనదేశంలో వ్యవసాయ రంగంలో దిగుమతి సుంకాలు పూర్తిగా ఎత్తివేయడానికి నిర్ణయించుకున్నారని, ఫలితంగా పామాయిల్ రేటు పతనావస్తలో ఉన్నదని అన్నారు.

భారతీయ వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ రాబందులకు ఆహారంగా వేయడానికి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. పామాయిల్ రంగాన్ని రక్షించడం కోసం రైతులంతా ఐక్యంగా ఉద్యమించటమే మార్గమని, పామాయిల్ టన్నుకు 25 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్, మండల కన్వీనర్ మురహరి రఘు, రామకృష్ణ, బాబురావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు