తెలంగాణ గిరిజన సంఘం కారేపల్లి మండల కమిటీ ఎన్నిక
- గౌరవ అధ్యక్షులుగా భూక్యా రంజిత్ నాయక్
- అధ్యక్ష కార్యదర్శులు గా బానోతు బన్సీలాల్ నాయక్ అజ్మీర శోభన్ నాయక్
సింగరేణి అక్టోబర్ 02 విజయ క్రాంతి: తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్)(Telangana Tribal Association) కారేపల్లి మండల మహాసభ కారేపల్లి భాగం రామ నర్సయ్య భవన్ లో అజ్మీర శోభన్ నాయక్ అధ్యక్షతన జరిగింది. మహాసభలో 15 మందితో నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రకటించారు.
నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా గాదేపాడు సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు భూక్యా రంజిత్ నాయక్, అధ్యక్షులుగా ఉసిరికాయలపల్లి మాజీ సర్పంచ్ బానోతు బన్సీలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా అజ్మీర శోభన్ నాయక్ ఎన్నికయ్యారు.సలహాదారులుగాలరామచంద్ర నాయక్, భూక్యా తోప్య నాయక్, ఉపాధ్యక్షులుగా భూక్యా రాంబాబు, ధరావత్ వినోద్ కుమార్, వాంకుడోత్ దళ్ సింగ్ నాయక్, సహాయ కార్యదర్శులుగా కేలోత్ రవి నాయక్, మాళోత్ బాలు నాయక్, భూక్యా రమేష్, ధరావత్ రవికుమార్, కమిటీ సభ్యులుగా బానోత్ శ్రీను, బాలు తదితరులను ఎన్నుకున్నట్లు భూక్య వీరభద్రం తెలిపారు.
గిరిజనతండా గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి, సొంత గ్రామపంచాయతీ భవనాలను నిర్మించాలని, కారేపల్లి మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి నిర్మించాలని, మాణిక్యారం లేదా చీమలపాడు ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఏర్పాటు, పోడు రైతులకు ఐటీడీఏ ద్వారా విద్యుత్ సౌకర్యం, బోర్లు మంజూరు, నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, కారేపల్లి మండల కేంద్రంలో సేవాలాల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి, ఇందుకోసం ప్రభుత్వం ఒక ఎకరం భూమి కేటాయించాలని తీర్మానించినట్లు తెలిపారు.
గిరిజనులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పథకాలు అందటానికి ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులను పర్మినెంట్, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ వంటి గిరిజన సమస్యలపై మహాసభ చర్చించి తీర్మానాలను ఆమోదించిందని తెలిపారు. మహాసభ ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు.