కళ్యాణలక్ష్మి పథకానికి 12 ఏళ్లు

02-10-2026 | 07:52pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి):కళ్యాణలక్ష్మి పథకం(Kalyana Lakshmi Scheme) ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌(BRS) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.

గత 12 ఏళ్లలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ద్వారా 16.78 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రే ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీభాయ్‌, మారుసుకోలా సరస్వతి, కౌన్సిలర్లు సలాం, రాజంపేట సర్పంచ్‌ పోషన్న, సర్పంచ్‌ లక్ష్మి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంధం శ్రీనివాస్‌, టౌన్‌ అధ్యక్షుడు ఆహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా, నిస్సార్‌, సమద్‌, సాయి శ్రవణ్‌, గుండా శ్యామ్‌, రవి, యాదగిరి, మహిళా నాయకులు సుప్రజ, ఉమ, భీంభాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు