సారు ఉద్యోగం సింగరేణి.. ప్రైవేట్ వ్యాపారాలపై మక్కువా.!
- నిబంధనలను తొక్కేస్తున్న వైనం
- అధికారులకు ఫిర్యాదు చేసిన అంతా మామూలే.!
- జీతం సొమ్ము సరదా.. ప్రైవేటు సొమ్ము కష్టం.!
- ఎటకారం ఆడుతున్న సింగరేణి అధికారులు.!
- కటిక దుకాణం, అక్రమ కలప వ్యాపారమే ఆయన వృత్తి.!
- ఫిర్యాదులు వచ్చిన పట్టించుకోరా.!
- సింగరేణి నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైనం.!
ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నామంటే ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. కానీ ఆ అధికారికి మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు అడ్డు రాకుండా, ఆడి ఆటా పాడింది పాటగా మారుతుంది. లక్షల రూపాయల జీతం తీసుకుంటూ, ప్రైవేటు వ్యాపారాలు నిర్వహిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడు. అధికారిపై ఎన్నిసార్లు ఫిర్యాదు వచ్చిన సింగరేణి అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వదిలేస్తున్నారు. ఆ సింగరేణి ఉద్యోగి పై విజయ క్రాంతి అందిస్తున్న ప్రత్యేక కథనం.
మణుగూరు, అక్టోబర్ 28,(విజయ క్రాంతి ): ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలలో(Public sector undertaking) ఉద్యోగం రావాలంటే ఎంతో కష్టపడితేనే ఉద్యోగం సాధించవచ్చు. కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం(Government job) సాధించిన నియమ నిబంధనలను దొంగలు తొక్కేస్తూ, ప్రైవేటు వ్యాపారాలకు మక్కువ చూపిస్తూ కోట్లకి పడిగెత్తుతున్నారు.
చేసే ఉద్యోగం ఏమో సింగరేణి సంస్థ, ప్రైవేటు వ్యాపారం చేస్తూ అందని కాడికి దోచుకుంటూ అధికారులను సైతం గుప్పెట్లో పెట్టుకున్నాడు. పైగా ఎవరైనా ఫిర్యాదులు చేస్తే సింగరేణి అధికారులు చర్యలు తీసుకుంటామని గొప్పలు చెబుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
మణుగూరు సింగరేణిలో ఓ ఉద్యోగి విధులు నిర్వహిస్తూ, కాలనీలోని కటిక దుకాణం, రాత్రుల్లో అక్రమ కలప వ్యాపారం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడు. గతంలో ఈ ఉద్యోగిపై ఫిర్యాదులు చేసిన ఎవరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. పత్రికల్లో వార్త వస్తే తూతూ మంత్రంగా విచారణ చేస్తూ, అలాంటిది ఏమీ లేదంటూ కొట్టిపాడేస్తున్నారు.
ఒకపక్క సింగరేణి జీతం తీసుకుంటూ, సింగరేణికి విరుద్ధంగా ప్రైవేటు వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగ నిర్వహిస్తూనే, ప్రైవేట్ వ్యాపారానికి ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే సార్ పని ఉంది, పర్మిషన్ ఇవ్వండి అంటూ, బయటికి వచ్చి మరి తన వ్యాపారం నిర్వహించుకుంటూ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నాడు.
ఏకంగా ఆ అధికారి కోట్ల రూపాయలకు పడగలెత్తిన, సింగరేణి అధికారులకు లక్షల రూపాయలు ఇచ్చి, సింగరేణి తల్లికి ద్రోహం చేస్తున్నాడు. పేరుకే సింగరేణి ఉద్యోగం, వ్యాపారం మాత్రం కటిక దుకాణం, అక్రమ కలప వ్యాపారం చేస్తూ సింగరేణి తల్లికి ద్రోహం చేస్తున్నాడు. ఈ వ్యక్తిపై పలసార్లు ఫిర్యాదు చేసిన, మేం చూసుకుంటాం అంటూ సింగరేణి అధికారులు గాడి తప్పారు.
ఎంతోమంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పగలు, రాత్రి కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించినాక, ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. ఆ వ్యక్తిపై సింగరేణి అధికారులకు ఎలాంటి ప్రేమంటే చెప్పలేని వర్ణాతితంగా మారాయి. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.