అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే గ్రామాభివృద్ధి
ఎమ్మెల్యే రాందాస్ నాయక్
సింగరేణి,(విజయక్రాంతి): అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్(MLA Maloth Ramdas Naik) అన్నారు. మొట్లగూడెం వెంకటేశ్వర కల్యాణ మండపంలో మాణిక్యారం క్లస్టర్ పరిధిలోని 10 గ్రామ పంచాయతీల(Gram panchayats)తో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.శాఖల వారీగా నివేదికలు తెప్పించుకుని పెండింగ్ పనులపై ఆరా తీశారు.
గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు, సర్పంచ్‌లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.