గళం విప్పిన.... కలం..

02-10-2026 | 09:05pm
  1. జిల్లావ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన 
  2. హక్కుల సాధనకై రోడ్ ఎక్కిన కలం వీరులు 

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 2 (విజయక్రాంతి): పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప... అన్నట్లుగా చెన్నలిస్టుల హక్కుల సాధనకై టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో(TUWJ) జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం రోజు జర్నలిస్టులు(Journalists ) గళం విప్పారు. హక్కుల సాధనకై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి జూన్ మాల రమేష్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించి మద్దతును తెలిపారు.

ప్రధానంగా జర్నలిస్టుల రక్షణకై నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పాత్రికేయుల భద్రతకు జాతీయ చట్టం తీసుకురావాలని, రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్టు చట్టాల ప్రకారం చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని, కొత్త వేతన మండల ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు హెల్త్ కార్డు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, అశ్వరావుపేట డివిజన్లోలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన ఆందోళన నిర్వహించి నిరసనలు తెలిపారు.

మరిన్ని వార్తలు