రామవరం ఆటో స్టాండ్లో ఘనంగా మహా అన్నదానం
30 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు..
ఆటో డ్రైవర్ల సేవలను అభినందించిన నాయకులు
మీడియా మిత్రులను ఘనంగా సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు...
కొత్తగూడెం అక్టోబర్ 17 విజయక్రాంతి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని(Bhadradri Kothagudem District) రామవరం ఆటో స్టాండ్లో శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను(Navaratri celebrations of Goddess Kanaka Durga), పురస్కరించుకుని శనివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆటో స్టాండ్లో అమ్మవారిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆలయ కమిటీ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా, టూ టౌన్ ఎస్హెచ్ఓ యాసిన్, మేయర్ మూడ్ గణేష్ హాజరై మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా(CPI District Secretary SK Shabir Pasha) మాట్లాడుతూ.. రామవరం ఆటో డ్రైవర్లు గత 30 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ, అన్నదాన కార్యక్రమాల ద్వారా సేవాభావాన్ని చాటుకోవడం అభినందనీయమన్నారు. ఐక్యత, భక్తి, సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రెస్ మిత్రులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కంచర్ల జమలయ్య, ఆలయ కమిటీ సభ్యులు నిండ్ర కృష్ణ, నరేందర్, గుబ్బల శ్రీను, కోటేశ్వరరావు, ఎస్కే అమిత్, మాజీ కౌన్సిలర్ మోహన్ రావు, సీపీఐ నాయకులు మండల రాజేశ్వరరావు, వంగా వెంకట్, తనికెళ్ల వీరస్వామి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుడిగడప వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు కంచర్ల హేమశ్రీ, మునిగడప పద్మ తదితరులు పాల్గొన్నారు.