జాతీయస్థాయి క్రీడాకారులను అభినందించిన సరస్వతి శిశు మందిర్ ప్రతినిధులు

17-10-2026 | 10:19pm

కామారెడ్డి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి సరస్వతీ శిశుమందిర్ హై స్కూల్(Saraswati Shishu Mandir High School, Kamareddy) విద్యార్థులు జాతీయస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. అండర్ 14 బాలికల కబడ్డీ జట్టు(Under-14 girls kabaddi team) విద్యా భారతి మధ్యప్రదేశ్ బేతుల్ లో నిర్వహించిన ఖేల్ కూద్ పోటీలలో(Sports and Games Competition) పాల్గొని ఫైనల్ మ్యాచ్లో ఉత్తర క్షేత్రం జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన జట్టు పై నెగ్గి గోల్డ్ మెడల్ సాధించారు. జాతీయస్థాయి క్రీడలకు(National level sports) ఎంపిక అయిన తర్వాత శనివారం కామారెడ్డి విచ్చేసిన సందర్భంగా పాఠశాల యాజమాన్యం(School Management) క్రీడాభిమానులు క్రీడాకారులను అభినందించారు.

క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు(Students) ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి  సరస్వతి శిశు మందిర్ వరకు నిర్వహించిన ర్యాలీలో సరస్వతి శిశు మందిర్ ప్రతినిధులు డాక్టర్ శ్యాంసుందర్ రావు,  గీరెడ్డి రాజా రెడ్డి, బొడ్డు శంకర్, బోనగిరి గోపాలకృష్ణమూర్తి,  సామల గంగారెడ్డి, రణజిత్ మోహన్, ప్రతాప్ గౌడ్,  రాజేందర్ గౌడ్, ముప్పారపు ఆనంద్, సంతోష్, పబ్బ శ్రీనివాస్, ధనుంజయ , డి వై ఎస్ ఓ రంగా వెంకటేశ్వర్ గౌడ్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బాణాల భాస్కర్ రెడ్డి, పేట అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి,  కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రాజు, కౌన్సిలర్ గరుగంటి లక్ష్మీనారాయణ, శిశుమందిర్ ప్రబంధకారిణి ఆచార్యులు, మాతాజీలు, పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్ ఎస్సై సాయి కృష్ణ , మాట్లాడుతూ విద్యార్థులు ఆటల్లో రాణించడం చాలా సంతోషమని భవిష్యత్తులో కూడా ఇలాగే ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. సరస్వతి శిశు మందిర్ ప్రతినిధి డాక్టర్ శ్యాంసుందర్ రావు మాట్లాడుతూ కామారెడ్డి చరిత్రలో నేషనల్ కబడ్డీ గెలిచినటువంటి చరిత్ర నూతనంగా విద్యార్థులు లిఖించారని ఇది కామారెడ్డికి తెలంగాణకు ఎంతో గర్వకారణమైన విషయమని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్ జి ఎఫ్ ఐ తరఫున వచ్చే  నెలలో హర్యానాలో ఈ జట్టు విద్యా భారతి తరపున పోటీ ల లో పాల్గొంటుందని  ప్రధానాచార్యులు నాగభూషణం, అకాడమిక్ ప్రిన్సిపల్ నగేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు