భవాని మాలలతో మార్మోగిన మహంకాళి క్షేత్రాలు

11-10-2026 | 09:49pm

నిష్టగా భవాని మాల ధరించిన భక్తులు

జిల్లావ్యాప్తంగా భారీగా మాల ధారణలు

కొత్తగూడెం అక్టోబర్ 11 విజయక్రాంతి : జిల్లాలోని అమ్మవారి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి.. దసరా పండగ(Dasara Festival) సమీపించిన తరుణంలో భక్తులు(devotees) విరివిగా మాలలు ధరించి, అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తొమ్మిది రోజుల పాటు సాగె ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో(Sharannavaratri celebrations) భాగంగా, పిల్లలు,పెద్దలు, వృద్ధులు, యువకులు విరివిగా మాలధారణ ధరించి, భక్తిశ్రద్ధలతో  నియమ నిబంధనలను నిష్టగా పాటించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

జిల్లాలోని ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి ఆలయాలలో ఈ మాలధారణ తంతు ను,పూజార్ల మంత్రోచ్ఛారణతో, భక్తుల ఆనందోత్సవాలతో, కుటుంబ సభ్యులతో భవాని మాల ధరించే భక్తులతో,మహంకాళి క్షేత్రాలు, ఆలయాలు ఎంతో శోభయమానంగా మారాయి. భవాని మాల ధరించే భక్తులు ఈ సంవత్సరం విరివిగా మాలలు ధరించారు అనీ కొత్తగూడెం త్రిమత ఆలయ క్షేత్ర పూజారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

 వినాయక చవితి అనంతరం భవాని మాత విగ్రహ ప్రతిష్టలను, యువత పలు వీధులలో ప్రతిష్టించి, మాలలు ధరించి, అమ్మవారి తొమ్మిది రోజుల తొమ్మిది అవతారాలతో అమ్మవారిని నిత్యం పూజిస్తూ,యువత తన్మయత్వంతోమునిగి తేలుతారు. నిత్య పూజా కార్యక్రమంలో నిమగ్నమవడానికి సిద్ధమయ్యారు భక్తులు.

మాల ధరించేభక్తులలో భక్తి భావం పెరగడం, యువత, హిందూ సాంప్రదాయ బద్ధంగా భక్తి శ్రద్ధతో,ఉండటం ఎంతో శుభ సూచకమని, యువత చెడు మార్గాన్ని వదిలి భక్తి మార్గాన్ని ఎంచుకోవడం హిందూ ధర్మంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప మానసిక పరిపక్వత కలిగిన అంశమని,ఆలయ ధర్మకర్తలు  తెలియజేశారు.. ఈ తొమ్మిది రోజులు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి,భక్తిశ్రద్ధలతో అమ్మవారి ని నిత్యo కొలిచిన వారికి, కొంగు బంగారమై,కీర్తి ప్రతిష్టలు పెరిగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లి,అమ్మవారి ఆశీస్సులతో వారు విజయం సాధిస్తారని పలు మహంకాళి పూజారులు భక్తులకు ఆశీస్సులు అందించారు.

మరిన్ని వార్తలు