టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి
ములకలపల్లి,అక్టోబర్ 3 (విజయక్రాంతి): టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ములకలపల్లిలో(Mulakalapalli) చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ములకలపల్లి గ్రామానికి చెందిన కాటారపు సాయిబాబు(58) అనే వ్యక్తి మృతి చెందాడు.ములకలపల్లి నుంచి తాళ్లపాయ గ్రామానికి వెళ్లే రహదారి సెంటర్ లో కూరగాయలు తీసుకొని పెద్ద బజారులోని ములకలపల్లిలోని ఇంటికి వెళ్తుండగా ఆ సమయంలో వెనకాల పాల్వంచ నుంచి తాళ్లపాయ రోడ్డు మార్గంలో దమ్మపేట వైపు వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి.
అంబులెన్స్ లో పాల్వంచకు తరలిస్తున్న సమయంలోనే మృతి చెందాడు.మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.మృతదేహాన్ని శివపరీక్ష కోసం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి సోదరుడు కాటారపు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ములకలపల్లి ఎస్ఐ మధు ప్రసాద్ తెలిపారు.