సంవిధాన్ రక్షక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే

27-11-2026 | 12:15am

ములకలపల్లి,నవంబర్ 26 (విజయక్రాంతి): ఎఐసిసి పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సంవిధాన్ రక్షక్ ర్యాలీలో (Constitution Protector Rally) పాల్గొన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం,సమానత్వం, లౌకికవాద పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

రాజ్యాంగం దేశ ప్రజలందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ ర్యాలీ ద్వారా సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ జూపల్లి కోదండరాం,జిల్లా  మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పొదిలి జ్యోతి,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పాలకుర్తి సుమిత్,బియల్ ఏ కోఆర్డినేటర్ సురభి రాజేష్ ములకలపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుర్రం జయసుధ,గుర్రం దేవేంద్ర,కొమరం జయ,బియల్ ఏ వేముల సాయి కృష్ణ,ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు