ఆర్డీవో కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం

27-11-2026 | 12:28am

భూ వివాదంలో న్యాయం జరగలేదని ఆవేదన.

నిర్మల్ నవంబర్ 26 ( విజయక్రాంతి): భూ వివాదంలో(Land dispute) తనకు అన్యాయం ను నివసిస్తూ  ఓ మహిళ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో(RDO Office) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణంలోని గాజులపేట్‌కు చెందిన జుమ్మెరాత్ లావణ్యకు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఏడు గుంటల భూమి విషయంలో వివాదం నెలకొంది.

ఈ క్రమంలో బుధవారం ఆ భూమిని ఓ ప్రైవేటు వ్యక్తికి విక్రయించగా, ముందస్తు ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన ఐదు గుంటల భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని లావణ్య ఆరోపించింది. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఇది సివిల్ వివాదమని అధికారులు పేర్కొనడంతో మనస్తాపానికి గురైన ఆమె, తన వెంట తెచ్చుకున్న ఇంటిని శుభ్రం చేసే ద్రావణాన్ని తాగేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆమె చేతిలోని డబ్బాను లాక్కున్నారు. అప్పటికే కొంత ద్రావణం సేవించడంతో లావణ్యను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లావణ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆర్డీవో కార్యాలయ ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని వార్తలు