సీఎం ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
27-11-2026 | 12:32am
ఆమనగల్లు, నవంబర్ 26(విజయక్రాంతి): అచ్చంపేట బహిరంగ సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి ని కల్వకుర్తి ఎమ్మెల్యే(Kalwakurthy MLA) శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం గారికి పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి(Development of Kalwakurthy Constituency) అంశాలపై సీఎం గారితో చర్చించారు.