77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

27-11-2026 | 12:04am

చిట్యాల, నవంబర్ 26 (విజయ క్రాంతి): చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను(Constitution Day celebrations) గురువారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు లింగస్వామి, నక్క యాదగిరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరుల హక్కులను పరిరక్షించడంతో పాటు సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను పెంపొందించేందుకు దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కార్యదర్శి రాజ్ కుమార్, జోగు చంద్రమౌళి, కట్ట వెంకటేశం, బత్తుల జనార్ధన్, కొంపెల్లి అంజయ్య,నక్క సైదులు, జోగు వెంకటేష్, బింగి లింగస్వామి, నక్క లింగస్వామి, నక్క పవన్, ఏడుకొండ శ్రీను,ఎస్ కే సలీం, నల్లవెల్లి కిరణ్, అనంతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు