నగరం నిద్రపోయిన వేళ చోరీ
పాల్వంచ, (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ లోనీ సుజిత్ పాన్ షాప్ లో చోరీ(Theft) జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న యజమానులు బయటికి రాకుండా ఉండేందుకు బయటి నుంచి తలుపులు గడివే పెట్టాడు. దుకాణం వెనక తలుపు గోల్లం శబ్దం రాకుండా మిషన్ తో కట్ చేసి దుకాణంలో ప్రవేశించాడు. కౌంటర్లో ఉన్న నగదును అపహరించుకొని పరారయ్యాడు.
పాత పాల్వంచలో దొంగల భయం
పాత పాల్వంచలో రాజస్థాన్ ముఠా సంచరిస్తుందని గత రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పాత పాల్వంచలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బిచ్చగాడు రూపంలో సంచరిస్తుంటే రాజస్థాన్ వాసిగా అనుమానించిన యువకులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.పోలీసులు విచారణ లో అతను మతిస్థిమితం లేని వాడని తేలడంతో వదిలివేశారు. అతని వద్ద చోరీకి ఉపయోగించే కొన్ని వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది.అదే రాత్రి చోరీ జరగటం పాత పాల్వంచలో భయాందోళన చోటుచేసుకుంది. పాత పాల్వంచలో జరిగిన చోరీపై పాల్వంచ పట్టణ పోలీసులు ఆరా తీస్తున్నారు.పాత పాల్వంచలో చోరీ కలకలం అనుమానితుడిని పట్టుకున్న యువకులు