రాకేష్ రెడ్డి గెలుపే కేసీఆర్‌కు కానుక

11-10-2026 | 10:10pm

మాజీ ఎం ఎల్ ఏ మెచ్చా

నిత్యం ప్రజల మధ్య ఉన్న నాయకుడు రాకేష్ రెడ్డి - ఉప్పల వెంకట రమణ

పదవి కోసం కాదు..సమస్యల పరిష్కారం కోసం పని చేస్తా - రాకేష్ రెడ్డి

దమ్మపేట, అక్టోబర్ 11(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి ఎంఎల్ సి ఎన్నికల(MLC elections) సన్నాహక సమావేశం అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎంఎల్ ఏ, బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు(Mecha Nageswara Rao) ఆధ్వర్యంలో దమ్మపేట వినాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి అశ్వారావుపేట నియోజకవర్గ(Ashwaraopet Constituency) సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంచార్జ్ ఉప్పల వెంకట రమణ, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు  ఏనుగుల రాకేష్ రెడ్డి(Enugula Rakesh Reddy) అతిథులుగా హాజరయ్యారు.

ఐదు మండలాల నాయకులు, బాధ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చెయ్యాలని, ప్రతీ నాయకుడు, కార్యకర్త పట్టుదలతో కృషి చేసి డిగ్రీ పూర్తి చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని, ఈ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని ఆయన అన్నారు. మండల నాయకులందరూ ఈ ప్రక్రియలో పూర్తిగా నిమగ్నం అవ్వాలని అన్నారు.

వెంకట రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ఎక్కడ చూసినా ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నారని, మళ్ళీ కెసిఆర్ రావాలని వారు చర్చించుకుంటున్నట్టు తెలిపారు. రాకేష్ రెడ్డి లాంటి మేధావులు గెలిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, కాంగ్రెస్ వారిని నమ్మితే మన జీవితాలు బుగ్గిపాలు అవుతాయని, ఎప్పటికప్పుడు నాయకులు సమన్వయం చేసుకుంటూ పని చెయ్యాలని, రాకేష్ రెడ్డి గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు.

రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశానని, కాంగ్రెస్ పార్టీ అధికార బలం, ఆర్థిక బలం ఉన్నందున ఓటర్ల నమోదు ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా పని చెయ్యాలని నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు