జేకే కాలనీలో రీజినల్ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు ప్రారంభం

19-10-2026 | 06:06pm

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని జేకే కాలనీ సీఈ యాప్‌లో డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో రీజినల్‌ స్థాయి చెస్‌, క్యారమ్స్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఏరియా జనరల్‌ మేనేజర్‌ వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఇల్లందు, మణుగూరు ఏరియాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జనరల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమి పాలైన వారు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. చెస్‌, క్యారమ్స్‌ వంటి క్రీడలు ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఉద్యోగుల్లో మానసిక చురుకుదనం, క్రీడాస్ఫూర్తి, పరస్పర స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ కోఆర్డినేటర్‌ కిషోర్‌, జనరల్‌ కెప్టెన్‌ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు