మాదారం చెరువు శుభ్రతకు సర్పంచ్ ఆదేశాలు

19-10-2026 | 06:00pm

సింగరేణి,(విజయక్రాంతి): బతుకమ్మ వేడుకల(Bathukamma celebrations) అనంతరం మాదారం చెరువును పరిశుభ్రం చేయాలని సర్పంచ్ ఉమా నరేష్ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఇందిరమ్మ డైరెక్టర్ నరేష్ కుమార్(Indiramma Director Naresh Kumar), మల్టీపర్పస్ వర్కర్లు స్వయంగా పాల్గొని చెరువులోని వ్యర్థాలను తొలగించారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను తరలించారు. ప్రజారోగ్యం, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ చేపట్టిన ఈ చర్యలను పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో అజ్మీర్ నరేష్, బట్టు నరసయ్య, రమేష్, వెంకన్న, పద్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు