జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
25-09-2026 | 05:51pm
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): దస్నాపూర్ పాఠశాలలో(Dasnapur School) విధులు నిర్వహిస్తున్న అడే శ్రావణ్‌కుమార్(Shravan Kumar) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా(best teacher) ఎంపికైన సందర్భంగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతి(Students' academic progress), సమగ్ర అభివృద్ధికి శ్రావణ్‌కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.