వేగవంతంగా డిజిటల్ క్రాప్ సర్వే..
జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి
తాడ్వాయి,సెప్టెంబర్, 25( విజయక్రాంతి ): ఫార్మా రిజిస్ట్రేషన్, పంటల సాగు వివరాల సేకరణ(Collection of crop cultivation details) కోసం ప్రారంభించిన డిజిటల్ క్రాప్ సర్వే(Digital Crop Survey) వేగవంతంగా సాగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామంలో శుక్రవారం ఆయన డిజిటల్ క్రాప్ సర్వే ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుల సాగు భూముల్లో(Farmers agricultural lands) ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అనే వివరాలను ఏ ఈ ఓ ల పర్యవేక్షణలో సర్వేయర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు.
సర్వేయర్లు ప్రత్యేక మొబైల్ యాప్(Special mobile app for surveyors) ద్వారా క్రాప్ సర్వే ను నమోదు చేస్తున్నారని తెలిపారు. రైతు భూమి పంట వివరాలతో పాటు పొలం పోటోలను ఒకే డిజిటల్ డేటా బేస్ లో పొందుపరుస్తున్నామని వివరించారు. రైతులు కచ్చితంగా తాము వేసుకున్న పంటలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవేందర్,సర్పంచ్ అంజనీ బాయి రఘుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.