విజయవంతమైన అన్న ప్రసాద వితరణ
గుండాల, సెప్టెంబర్ 21(విజయక్రాంతి):మండల కేంద్రంలోని జీసీసీ సెంటర్ గణేష్ మండపం(GCC Center Ganesh Mandapam) వద్ద సోమవారం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం బతుకమ్మ ఘాట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ శ్రవణ్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త మానాల ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. భక్తులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని అన్న ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు.
నిర్వాహకులు అన్న ప్రసాద వితరణకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వెలిశాల నరేష్, మాజోజు పవన్ కుమార్, వెలిశాల వేణు, వెలిశాల రవి, మాజోజు చంద్రా చారి, వెలిశాల రమేష్, శ్రీరంగం శ్రీను, వెలిశాల శ్రీను, వెలిశాల సత్యం, వెలిశాల వేణు, కొనపర్తి వెంకటేశ్వర్లు, మాజోజు వెంకటేష్, మాజోజు జగన్, మాజోజు ప్రవీణ్, వెలిశాల రాకేష్, వెలిశాల విద్యాసాగర్, యువత, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.