లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ కార్యక్రమం
పాల్వంచ (విజయక్రాంతి): స్వచ్ఛతా హీ సేవా(Swachhata Hi Seva)–2026 కార్యక్రమంలో భాగంగా 1వ రోజు షెడ్యూల్లో భాగంగా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాలలో జిల్లా పంచాయతీ అధికారి బి. అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఎస్ డబ్ల్యూ ఎం రూల్స్–2026లో సూచించిన నాలుగు రకాల వ్యర్థాల వేరు వేరు సేకరణపై అవగాహన కల్పించారు. వ్యర్థాలను మూలస్థాయిలోనే సక్రమంగా వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం , పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత ప్రాముఖ్యతను వివరించారు.
విద్యార్థులు తమ ఇళ్లలో, పాఠశాలలో, పరిసరాల్లో పరిశుభ్రతను పాటిస్తూ, వ్యర్థాలను వేరు చేసి నిర్వహించేలా చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, పాల్వంచ ఎం పి ఓ, పంచాయతీ కార్యదర్శి, గురుకుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.