ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై తహసీల్దార్ పరిశీలన
19-09-2026 | 02:01pm
పినపాక సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): ఏడూళ్ల బయ్యారం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(Special Summary Revision of Electoral Rolls) కార్యక్రమంలో భాగంగా ఏడూళ్ల బయ్యారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా(Voter List)లో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఓటర్ల వివరాల్లో తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించి సవరణలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం కార్యదర్శి సంధ్య, బీ ఎల్ ఓ జి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.