రక్తదానంపై అవగాహన ర్యాలీ
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ స్వచ్ఛంద రక్తదానం(National Voluntary Blood Donation)కు సంబంధించి అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ శని వారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్త దానంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో అక్టోబర్ రెండవ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టుతున్నామని పేర్కొన్నారు. రక్తదానము ప్రాముఖ్యత గురించి తెలియజేయడం,మానవత్వంతో ఒక చుక్క రక్త దానం(Donating a drop of blood) చేయండి -ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన రక్తదాన వైద్య శిబిరాలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ ర్యాలీలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్,డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, పుట్ట సత్తయ్య, వెంకటేశ్వర్లు, డాక్టర్ రమ్య, డాక్టర్ అమన్, రెడ్ క్రాస్ మహేందర్, తలసీమియా అధ్యక్షులు శ్రీనివాస్, వైద్యులు, వైద్య సిబ్బంది, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు, సికిల్స్ తలసీమియా స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఎన్జీవోలు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.